తాప్సీ సినిమా కోసం నవీన్ పొలిశెట్టి వాయిస్..

87
- Advertisement -

బాలీవుడ్‌ బ్యూటీ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ రాజ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో ముగ్గురు పిల్ల‌లుగా రోష‌న్‌, బానుప్ర‌కాష్, జైతీర్థ న‌టించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుద‌ల కాబోతుంది.

అయితే ఈ చిత్రానికి యంగ్‌ హీరో నవీన్ పొలిశెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్ మీడియా ద్వారా ఇచ్చారు. మరి తన వాయిస్ ఓవర్‌తో సినిమాను నవీన్ ఎలా నడిపిస్తాడో చూడాలి. కాగా, మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నాడు. చాలా కాలం తర్వాత తాప్సీ నటించిన ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో రిలీజ్‌ వరకు వేచిచూడాల్సిందే.

- Advertisement -