ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి కుర్మయ్యగారి నవీన్‌కుమార్ ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయిన కె .నవీన్ కుమార్ గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి ,అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులు నుంచి అందుకున్నారు.
ఈ ఎన్నికను శుక్రవారం అధికారికంగా ప్రకటించారు అధికారులు. నవీన్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం ఆయన నామినేషన్ మాత్రమే సక్రమంగా ఉండటంతో ఆయన ఎన్నికైనట్టు ప్రకటించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రిటర్నింగ్ ఆఫసీర్(అసెంబ్లీ సెక్రటరీ)నుంచి ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. అనంతరం గన్ పార్కు లోని అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు ,ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ లు ,trs నేతలు పాల్గొన్నారు.
గన్ పార్క్ వద్ద ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ మాట్లాడుతూ.. నాకు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన సీఎం కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి ధన్యవాదాలు.. నా మీద నమ్మకంతో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు..ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుని అంకిత భావంతో పనిచేస్తా.. పార్టీ ప్రతిష్ట పెంపొందించేందుకు ఎమ్మెల్సీగా నా వంతు ప్రయత్నాన్ని బాధ్యతతో కొనసాగిస్తా..ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
కూకట్‌పల్లికి చెందిన కొండల్‌రావు, తిలోత్తమ దంపతులకు నవీన్‌రావు 1978 మే 15న జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్‌లో పాఠశాల విద్య, ఉప్పల్ లిటిల్‌ఫ్లవర్ కాలేజీలో ఇంటర్మీడియట్, బద్రుకా కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. ఉస్మానియావర్సిటీ నుంచి ఎంబీఏ %