ముస్తాబైన `చంద‌మామ రావే`

231
- Advertisement -

అందాల రాక్ష‌సి చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమ‌య్యి…టాలీవుడ్‌ యంగ్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న న‌వీన్ చంద్ర చేస్తున్న నూత‌న చిత్రం చందమామ రావే . ప్రియ‌ల్ గోర్ అనే నూత‌న తార హీరోయిన్ గా న‌టిస్తుంది. “అది రాదు.. వీడు మార‌డు“ అనేది క్యాప్ష‌న్. ఈ చిత్రాన్ని ఐఇఎఫ్‌ కార్పోరేషన్‌ ఇటాలీయన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ ఫిల్మ్ ప్రోడ‌క్ష‌న్ నెం-1 గా నిర్మాత‌లు కిర‌ణ్ జ‌క్కంశెట్టి, శ్రీని గుబ్బాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామ్‌గోపాల్ వ‌ర్మ స‌హా ప‌లువురు స్టార్ డైరెక్ట‌ర్స్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన క‌వ‌ల ద‌ర్శ‌కులు ధ‌ర్మ‌-ర‌క్ష ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్య‌క్ర‌మాలు పూర్తీ చేసుకుని రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Chandamama Raave Movie

నిర్మాత కిర‌ణ్ జ‌క్కంశెట్టి మాట్లాడుతూ “ఎంతో మంది స్టార్ డైరెక్ట‌ర్స్ వ‌ద్ద ద‌ర్వ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన ద‌ర్శ‌కులు ధ‌ర్మ‌, ర‌క్ష‌లు సినిమాను చ‌క్క‌గా రూపొందించారు. ప్ర‌పంచంలో ట్విన్స్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా కూడా మా చిత్ర‌మే కావ‌డం విశేషం. సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమా చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. పెక్యుల‌ర్ ల‌వ్‌స్టోరీ. ల‌వ్‌కు, లైఫ్‌కు టైమింగ్ చాలా అవ‌స‌ర‌మ‌ని చెప్పే ఎక్స్‌ట్రీమ్ ల‌వ్‌స్టోరీ. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీను ప్రేక్ష‌కులకు అందించాల‌నే ఆలోచ‌న‌తో ఈ సినిమాను రూపోందించామన్నారు.

Naveen-Chandra-Chandamama-Raave-Movie-Trailer

న‌వీన్‌చంద్ర పాత్ర చాలా ఆస‌క్తిక‌రంగా, యూనిక్‌గా ఉంటుంది. మంచి ఎమోష‌న్స్‌తో సాగే చిత్రం. హీరో న‌వీన్‌చంద్ర పూర్తి స‌హ‌కారాన్ని అందించారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఖ‌ర్చుకు ఏమాత్రం వెన‌కాడకుండా హిమాల‌యాలు, గ్యాంగ్‌ట‌క్ స‌హా ప‌లు ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రిపాం. ఇటీవ‌ల టీజ‌ర్‌ను విడుద‌ల చేశాం. టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేసి, సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు. ఈ చిత్రానికి ఎడిట‌ర్ఃఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌, మ్యూజిక్ః శ్ర‌వ‌ణ్‌, సినిమాటోగ్ర‌ఫీః వెంక‌ట్ ప్ర‌సాద్‌, నిర్మాత‌లుః కిర‌ణ్ జ‌క్కంశెట్టి, శ్రీని గుబ్బ‌ల‌, ద‌ర్శ‌క‌త్వంః ధ‌ర్మ‌-ర‌క్ష‌.

- Advertisement -