భారత సంతతి మహిళకు మరో కీలక పదవి..

173
us
- Advertisement -

అమెరికాలో భారత సంతతి మహిళకు మరో కీలక పదవి దక్కింది. ఇప్పటికే బైడెన్‌ టీమ్‌లో ఇండో అమెరికన్‌లకు పెద్ద ఎత్తున స్ధానం దక్కించుకోగా తాజాగా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ మొదటి వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా ఇండో అమెరికన్‌ నౌరిన్‌ హసన్‌ నియామకమయ్యారు.

హసన్‌ ఎన్నికను గవర్నర్స్‌ బోర్డ్‌ ఆమోదించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా న్యూయార్క్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాన్ విలియమ్స్ మాట్లాడుతూ ఆమె నియామమకం ఈ నెల 15 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. ఆమెతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు.

ఫైనాన్షియల్‌ సర్వీస్‌ రంగంలో నౌరీన్‌ హసన్‌కు 25 సంవత్సరాల అనుభవం ఉంది. ఆమె తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వెళ్లారు. నౌరీన్ హసన్.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యూయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టా పొందారు.

- Advertisement -