నాచురల్ స్టార్ నాని రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. ఎందుకంటే ఈ తరం హీరోలలో నానికి ఉన్న సక్సెస్ రేటు మరే హీరోకి లేదనే చెప్పాలి. ఇప్పటికే డబుల్ హ్యట్రిక్ సాధించిన నాని నిన్నుకోరి చిత్రంతో మరో హిట్ కొట్టాడు. ఇక ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకుడిగా ‘ఎంసీఏ’ సినిమాను నాని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీని తర్వాత తాను చేయబోయే మరో రెండు సినిమాల విశేషాల్ని కూడా వెల్లడించాడు నాని.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, `ఎక్స్‌ప్రెస్ రాజా`, `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్` సినిమాల దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్దం సినిమాతో పాటు కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో తనికి మంచి హిట్ ఇచ్చిన హను రాఘవపూడితో మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా మిలిటరీ నేపథ్యంలో సాగనుందని అన్నాడు. ఈ రెండు సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్, హిప్ హాప్ తమిళ సంగీతం సమకూర్చుతున్నారు. వీటిలో `కృష్ణార్జున యుద్ధం` సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఆగస్ట్ లో పూజా కార్యక్రమాలు జరుపుకొని సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్ళనుందట. ఏదేమైన నాని ఏడాది కి రెండు మూడు సినిమాలతో తన డైరీ ఖాళీ లేకుండా చేసుకుంటున్నాడన్నమాట.
ప్రస్తుతం నాని నటిస్తున్న నిన్నుకోరి ఓవర్సీస్ లో ఏకంగా వారం రోజుల్లోనే మిలియన్ మార్క్ ని దాటేసింది. దీంతో పవన్ కళ్యాణ్ వెనక పడిపోగా నాని ముందు వరుసలోకి వచ్చాడు. ఓవర్సీస్ లో 1 మిలియన్ దాటిన సినిమాలు పవన్ కళ్యాణ్ కు 3 సినిమాలు ఉండగా నిన్ను కోరి చిత్రంతో నాలుగు 1 మిలియన్ వసూళ్ల ని సాధించిన చిత్రాలు ఉన్నాయి నాని కి దాంతో పవన్ రికార్డ్ ని నాని బద్దలు కొట్టి నట్లైంది.