మ‌రోసారి మారుతి ద‌ర్శ‌క‌త్వంలో నాని

254
nani Maruthi
- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం జెర్సీ మూవీలో బిజీగా ఉన్నాడు. మ‌ళ్లీ రావా మూవీ ఫేం ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహించ‌గా సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. నాని స‌ర‌స‌న శ్ర‌ధ్దా శ్రీనాధ్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఏప్రిల్ 25న ఈచిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర‌యూనిట్. ఈమూవీలో నాని క్రికెట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈమూవీ త‌ర్వాత నాని విక్ర‌మ్ కుమార్. కె ద‌ర్శక‌త్వంలో చేయ‌నున్నాడు.

Nani Jersey Movie

తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం ద‌ర్శ‌కుడు మారుతితో కూడా నాని సినిమా చేయ‌నున్నాడ‌ని తెలుస్తుంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమా భారీ విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఈమూవీ త‌ర్వాత నాని వ‌రుస విజయాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని కూడా చెబుతున్నారు. ఈమూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించనున్నారని సమాచారం.

గ‌తంలో మారుతి అల్లు అర్జున్ తో సినిమా తీయ‌నున్నాడ‌ని వార్త‌లు వచ్చాయి. కానీ అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్ కు ఓకే చెప్ప‌డంతో మారుతి నానిని చూసుకున్నాడు. మారుతి చివ‌ర‌గా తెర‌కెక్కించి శైల‌జారెడ్డి అల్లుడు సినిమా అనుకున్నంతగా ఆడ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌కు పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు.

- Advertisement -