క్రికెట్ కోచింగ్ తీసుకుంటోన్న నాని..

270
Nani
- Advertisement -

వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోన్న నానికి కృష్ణార్జున యుద్దం సినిమాతో ఫెయిల్యూర్ ను ఎదుర్కొన్నాడు. ఇక ప్రస్తుతం నాని యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ మ‌ల్టిస్టార‌ర్ సినిమాలో న‌టిస్తోన్నాడు. ఈసినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. అంతేకాకుండానాని బిగ్ బాస్ 2 లో వ్యాఖ్యాత‌గా కూడా న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈసినిమా త‌ర్వాత నాని మ‌రో మూవీకి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. మ‌ళ్లి రావా సినిమా ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్ననూరి ద‌ర్శ‌క‌త్వంలో జెర్సీ అనే సినిమాను చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

Nani

క్రికెట్ నేప‌థ్యంలో ఈసినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. ఈమూవీకి సంబంధించిన పోస్ట‌ర్ ను కూడా ఇటివ‌లే విడుద‌ల చేశారు. ఈసినిమా కోసం నాని ప్ర‌త్యేకంగా క్రికెట్ కోచింగ్ కూడా తీసుకుంటున్నాడు. సినిమా పూర్తిగా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సాగ‌నుంది కాబట్టి సినిమాను మొద‌లు పెట్టే వ‌ర‌కూ క్రికెట్ లో మంచి గ్రిప్ సంపాదించుకొనున్నాడు నాని.

Nani

ఈసినిమాలో నానికి క్రికెట్ అంటే ఇష్టం..ఎలాగైనా జ‌ట్టులో స్ధానం సంపాదించుకోవాల‌నే త‌ప‌న‌తో ఈసినిమానే ప్రారంభ‌మ‌వుతోంద‌న్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా క్రికెట్ పై అత‌నికి ఉన్న అభిమానంతో జ‌ట్టులో ఎలా స్ధానం సంపాదించుకుంటాడ‌నేది క‌థ మొక్క సారంశం అని చెప్పారు. ఈచిత్రం రెగ్యూల‌ర్ షూటింగ్ ను సెప్టెంబ‌ర్ మొద‌టి వారం నుంచి ప్రారంభించ‌నున్నారు. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈమూవీని నిర్మిస్తోన్నారు. విభిన్నమైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ టాలీవుడ్ లో స‌క్సెస్ పుల్ హీరోగా కొన‌సాగుతున్నాడు నాని.

- Advertisement -