సంజన కామెంట్స్ పై నాని కౌంటర్..

204
Sanjana-Anne-sensational-comments-on-Bigg-Boss-2-host-Nani
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్-2కు నాని వ్యాఖ్యాతగా వ్యవహిరిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్-2 మొదటి వారంలో ఎలిమినేషన్ రౌండ్ లో సంజన నిష్ర్కమించింది. ఆమె బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత వ్యాఖ్యాత నానిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. నాని వ్యాఖ్కాతగా చేయడం నాకు నచ్చలేదని, నాని వ్యాఖ్యతాగా చేయడం వల్లన షోకి పెద్దగా క్రేజ్ రాలేదని చెప్పారు.

Nani Perfect Couter Sanjana sensational comments

ఇక ఎన్టీఆర్ ఐ ఫోన్ లాంటివాడు. నాని చైనా ఫోన్ లాంటివాడని, ఒక్కసారి ఐ ఫోన్ వాడిన తర్వాత వేరే ఫోన్టు నచ్చవు అంటూ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ సీజన్-2లో ఉండాలని అనిపించలేదని, ఆ షో నచ్చకనే బయటికి వచ్చానని సంజన తెలిపింది. ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టం అని, ఆయన వల్లనే బిగ్ బాస్ కి అంత క్రేజ్ వచ్చిందని చెప్పింది.

సంజన వ్యాఖ్యలపై బిగ్ బాస్ వ్యాఖ్యాత నాని స్పందించారు. తనకు కూడా ఐ ఫోన్ అంటేనే ఇష్టమని నాని ట్వీట్ చేశాడు. మరోవైపు ఎన్టీఆర్ వ్యాఖ్యతగా చేసిన బిగ్ బాస్ తెలుగు బులితెరపై సంచలనం సృష్టించింది. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యధికంగా ప్రేక్షకులు వీక్షించిన షోగా రికార్డు సృష్టించింది. బిగ్ బాస్ సీజన్-2 మొదటి సీజన్ మాదిరిగా ఆకట్టుకోవటం లేదనే చెప్పాలి.

- Advertisement -