- Advertisement -
వేసవి వచ్చిందంటే భానుడు ప్రతాపం చూపిస్తాడు.. గత కొద్ది రోజులుగా ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బయటకు వెళ్తే వడదెబ్బ తగిలి అస్వస్థకు గురికావచ్చు. ఎండలో ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా తిరిగితే శరీరం అదుపు తప్పుతుంది. శరీర ఉష్ణో గ్రతను నియంత్రించే వ్యవస్థ బలహీనపడి వడదెబ్బకు గురవుతారు. అయితే ఎడదెబ్బ నుండి మన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుకుందాం.. వేసవిలో ఎండదెబ్బ తగలకుండా ఈ చిక్కాలు పాటిస్తే ఎంతో మేలు..
- – ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో గొడుగు తప్పనిసరిగా వాడాలి.
- – కాటన్ దుస్తులు లేదా లేత రంగు పలుచటి దుస్తులు వేసుకోవాలి.
- – బహిరంగ ప్రదేశాల్లో తలకు టోపీ లేదా టవల్ చుట్టుకోవాలి.
- – మజ్జిగ,నిమ్మరసం,గ్లూకోజ్ వాటర్, ఓఆర్‌ఎస్‌లు తీసుకోవాలి.
- – వడదెబ్బకు గురైన వారిని వెంటనే చల్లటి ప్రదేశానికి తరలించాలి.
- – చల్లటి నీటిలో ముంచిన గుడ్డలో శరీరం అంతా తుడవాలి.. బాధితులని ఫ్యాన్ కింద ఉంచాలి.
- – సదరు వ్యక్తి ఆర్యోగ్య పరిస్థితిలో ఆశించాన మార్పు లేనిచో సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.
- Advertisement -