భారత హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ గౌరవ సూచకంగా ఆయన పుట్టిన రోజైన ఆగష్టు 29 న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. జాతీయ క్రీడా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం క్రీడల గురించి దేశజనులకు అవగాహన కల్పించడం. క్రీడలు మన మానసిక స్థితిని మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి. శారీరక దృఢత్వాన్ని మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతాయి. చిన్నపిల్లలలో మానసిక వికాసానికి ఆటలు ఎంతగానో తోడ్పడుతాయి.
ధ్యాన్ చంద్ ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. ప్రపంచ అత్యుత్తమ హాకీ క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1928, 1932, 1936 ఒలంపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాండించాడు. 1956లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించగా ధ్యాన్ చంద్ పేరు మీద భారత ప్రభుత్వం భారత అత్యున్నత క్రీడా అవార్డు “మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న” అవార్డులు ఇస్తున్నారు.
ప్రతీ సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు రాష్ట్రపతి భవన్ లో ఘన గా జరుగుతాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులను అవార్డులతో సత్కరిస్తారు. నేషనల్ అవార్డ్స్ కింద మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న( రాజీవ్ ఖేల్ రత్న), అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఫర్ లైఫ్ టైం అచీవ్మెంట్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మౌలానా అబుల్ కలాం అజాద్ ట్రోఫీ మరియు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ ను ఇస్తారు.
Also Read:హీరోగా విజయ్ తనయుడు జాసన్ సంజయ్