జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు

6
- Advertisement -

యాదగిరిగుట్టలో నేటి నుంచి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రవాణా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు మాత్రమే కాకుండా ప్రతి పౌరుడు కూడా రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకుని, ఈ మాసోత్సవాల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రోడ్డు నిబంధనలను పాటించడం ద్వారా అనేక విలువైన ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ సమన్వయంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. ప్రతి విద్యార్థి ద్వారా వారి తల్లిదండ్రుల నుంచి రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తామని హామీ పత్రాలు తీసుకుంటున్నామని చెప్పారు. చిన్న వయసులోనే రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు.

Also Read:KTR:’వర్కర్ టు ఓనర్‌’..అమలేది?

అలాగే తెలంగాణలోని ప్రతి పాఠశాల తప్పనిసరిగా రోడ్ సేఫ్టీ క్లబ్‌లో చేరాలని మంత్రి పొన్నం ప్రభాకరం సూచించారు. ఈ మాసోత్సవాల ద్వారా రాష్ట్రంలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

- Advertisement -