సీఎంఆర్‌ఎఫ్‌కు NHA కాంట్రాక్టర్ల భారీ విరాళం..

181
cmrf
- Advertisement -

కరోనా(కోవిడ్-19)మహమ్మారి నిర్మూలనకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా…నేషనల్ హైవే అథారిటీ కి చెందిన ఆరుగురు కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎం రిలీఫ్ ఫండ్) కి 2 కోట్ల 25 లక్షల రూపాయలు భారీ విరాళాన్ని ప్రకటించారు.

సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి సంబంధిత చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వారిని అభినందించారు. కరోనాపై పోరుకు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి తమ వంతు సహాయాన్ని అందించిన కాంట్రాక్టర్లకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపి ప్రత్యేకంగా అభినందించారు.

విరాళం అందించిన కాంట్రాక్టర్ల వివరాలు:

1.ఎ.జలందర్ రెడ్డి-అనూష ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్-50లక్షలు

2.అనిరుధ్ గుప్తా – డి.ఇ.సి ఇన్ఫ్రాస్ట్రక్చర్&ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ -50లక్షలు

3.కె.అనిల్ కుమార్ -కె.పి.సి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ -50లక్షలు

4.బి.వెంకట్ రెడ్డి – ఎస్.ఎల్.ఎమ్.ఐ ఇన్ఫ్రా ప్రాజెక్ర్స్ -25 లక్షలు

5.రవీందర్ రెడ్డి -శ్రీ వెంకటేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ -25 లక్షలు

6.సుబ్బారావు -సీల్ వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ -25 లక్షలు

- Advertisement -