కరోనా నియంత్రణపై సీఎం కేసీఆర్ సమీక్ష

180
kcr cm

ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌ అమలుపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ఆరోగ్య, పోలీసు శాఖల ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడనున్నారు.