మేడారం జాతర సందర్భంగా లైంగిక దాడి ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి. ఇటీవలి మేడారం జాతర సమయంలో ఓ బాలికపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారంటూ వచ్చిన వార్తలు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ (NCW) తీవ్రంగా స్పందించింది.
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలను సుమోటోగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయా రహాట్కర్ ఈ ఘటనపై వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేలా, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కమిషన్ స్పష్టం చేసింది.
ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి NCW సభ్యురాలు డెలినా అధ్యక్షత వహించనుండగా, నేటర్ కంచన్ కట్టర్ సభ్యురాలిగా ఉన్నారు. ఈ విచారణ నేటి నుంచి ప్రారంభం కానుంది. విచారణలో భాగంగా స్థానిక అధికారులు, బాధిత కుటుంబ సభ్యులు, ప్రత్యక్షసాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయనున్నట్లు సమాచారం. ఘటనపై పూర్తి నివేదికను కమిషన్‌కు సమర్పించనున్నారు.

Also Read:భారత్‌తో మ్యాచ్ ఆడబోం:పాక్ ప్రధాని

