ఉపాధి హామీలో తెలంగాణకు అవార్డుల పంట

183
National Awards to Telangana
- Advertisement -

తెలంగాణకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు లో అత్యుత్తమ ప్రగతి కనబర్చినందుకు జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ఐదు అవార్డులు దక్కాయి. యువతకు ఉపాధి శిక్షణ, అవకాశాలు కల్పించడంలో విశేష కృషి చేసినందుకు దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అవార్డును తెలంగాణ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంయం) కైవసం చేసుకుంది. అలాగే జాతీయ స్థాయిలో నేషనల్ రిసోర్స్ ఆర్గనైజేషన్- నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (ఎన్ ఆర్వో-ఎన్ ఆర్ ఎల్ యం) ఉత్తమ అవార్డును కూడా తెలంగాణ సెర్ప్ సొంతం చేసుకుంది.

National Awards to Telangana
డిల్లీలోని విజ్ఞానభవన్లో సోమవారం అవార్డులను  కేంద్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి నరేంద్రసింద్ తోమర్, సహాయ మంత్రి రాం కృపాల్ యాదవ్ ప్రధానం చేశారు.   కోరిన ప్రతి ఒక్కరికి జాబు కార్డు ను అందించడం… వికలాంగులకు, అంతరించి పోతున్న ఆదిమ తెగలకు ప్రత్యేక జాబ్ కార్డ్ లు జారి చేయడంతో పాటు కూలీలకు వేతన స్లిప్ లను అందజేయడం, కూలీల ఖాతాలో వేతనాలు జమకాగానే ఎస్‌ఎమ్మెస్‌ పంపించడం, సోషల్ ఆడిట్ కార్యక్రమాలు సమర్ధవంతంగా నిర్వహించడం, ఉపాది పనులన్ని౦టిని కరపత్రముల ద్వారా ప్రచారం చేయడం, ప్రత్యేక గ్రామీణ అభివృధి కాల్ సెంటర్ ద్వార పిర్యాదులు పరిష్కారం వంటి కార్యక్రమాలకు గాను జాతీయ స్థాయిలో పారదర్శికత మరియు జవాబుదారీతనం కేటగిరి క్రింద తెలంగాణా అవార్డును కైవసం చేసుకుంది.  అలాగూ ఈ పధకం లో కల్పించిన అన్ని ఆస్తులకు భువన్ సాఫ్ట్ వేర్ ద్వార జియో ట్యాగ్ చేయడం ద్వారా  అంత్యంత ఎక్కువ ఆస్తులను కంప్యూటరీకరించినందుకు మరో జాతీయ అవార్డు తెలంగాణ ఖాతాలో పడింది. ఈ అవార్డులను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ అందుకున్నారు.

National Awards to Telangana
అలాగే అత్యంత ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించడం, సకాలంలో వేతనాల చెల్లింపులు  చేయడం, అత్యధిక సరాసరి వేతనం చెల్లించినందుకు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అవార్డు అందుకున్నారు. అదే విధంగా ఉపాధి హామీలో క్రియాశీలకంగా వ్యవహరించి గ్రామ౦లో ఉన్న కూలిలలో ఎక్కువ మందికి పని కల్పించినందుకు నిజామాబాద్ జిల్లా మనోహరాబాద్ గ్రామ సర్పంచ్ తిరుపతి రెడ్డి అవార్డు అందుకున్నారు. ఉపాది హామీ పధకంలో పని చేసిన కూలీలకు సకాలంలో వేతన చెల్లింపులు చేసినందుకు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఇందల్వాయి బ్రాంచ్ పోస్ట్ అబ్దుల్ సత్తార్ అవార్డును అందుకున్నారు.

National Awards to Telangana
అలాగే డీడీయూ-జీకేవై, ఎన్ఆర్వో-ఎన్ ఆర్ ఎల్ యం కేటగిరీల్లో మరో రెండు అవార్డులు తెలంగాణాకే దక్కాయి. ఎక్కువ మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, ఉపాధి అవకాశాలు కల్పించిన రాష్ట్రంగానూ తెలంగాణా నిలిచింది. దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అవార్డు కూడా తెలంగాణా ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీయంయం) దక్కించుకుంది. అలాగే ఉత్తమ నేషనల్ రిసోర్స్ ఆర్గనైజేషన్-నేషనర్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అవార్డును తెలంగాణ సెర్ప్ దక్కించుకుంది. ఈ అవార్డును సెర్ప్ సీఈఓ పౌసమి బసు అందుకున్నారు. అవార్డు గ్రహీతలను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు. రానున్న రోజుల్లో ప్రతి విభాగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -