మోడీ నేతృత్వంలోని కేంద్రసర్కార్ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు ఇవాళ దేశవ్యాప్త సమ్మెకు దిగాయి. 28,29 రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మెలో దాదాపు 20 కోట్ల మంది కార్మికులు పాల్గొననున్నారు.
సమ్మె నేపథ్యంలో రవాణాకు అంతారయం ఏర్పడనుండగా నిత్యావసర సేవలైన రవాణా, బ్యాంకింగ్, రైల్వే, విద్యుత్తు సేవలపై ప్రభావం పడనుంది. కేంద్రప్రభుత్వం విద్యుత్ సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని రాష్ట్రాలకు సూచనలిచ్చింది.
బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌కు చెందిన ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో భాగస్వాములు కానున్నారు. కోల్, స్టీల్, ఆయిల్, టెలికాం, పోస్టల్, ఇన్‌కమ్ ట్యాక్స్, కాపర్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ ఇలా ఆయా రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చాయి.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె జరగనుంది.