సీనియర్ బ్యూటీ త్రిష వివాహం పై వచ్చినన్ని రూమర్లు మరో హీరోయిన్ పై రాలేదు. గత పది సంవత్సరాలుగా త్రిష పెళ్లిపై రూమర్లు వస్తూనే ఉన్నాయి. సహజంగా ‘కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. కానీ, త్రిషకు మాత్రం ఆ కళ్యాణ ఘడియలు ఎందుకు రావడం లేదో ?, అసలు త్రిష ఎందుకు పెళ్ళికి దూరంగా ఉంది ?, ఇలా చాలా డౌట్లు ఉన్నాయి ఆమె అభిమానుల్లో. ఐతే, త్రిష – ఓ బిజినెస్ మెన్ కి మధ్య తాజాగా నిజంగానే ప్రేమ కథ నడుస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.
దాంతో, సోషల్ మీడియాలో త్రిష పెళ్లి పై చాలా కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి త్రిష పెళ్లికి ఉన్న డిమాండ్ ను గ్రహించిన గాసిప్ రాయుళ్లు మళ్లీ ఆమె పెళ్లి పై అనేక కథనాలు రాసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. త్రిషకి వృత్తి పై అంకితభావం ఎక్కువ, అందుకే, ఇన్నాళ్లు పర్సనల్ లైఫ్ ను కూడా పట్టించుకోకుండా కెరీర్ కోసమే కట్టుబడి ఉంది. 39 సంవత్సరాల వయసులో కూడా త్రిష ఇంకా మేకప్ పూసుకుంటూ.. తనకు సినిమాలే లోకం అంటూ కాలక్షేపం చేస్తోంది.
Also ReadL: ఉగ్రంలో నాది ఛాలెజింగ్ రోల్: మిర్నా
మరోవైపు త్రిషతో పాటే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీయా, కాజల్ లాంటి హీరోయిన్లు ఆల్ రెడీ పెళ్లి చేసుకుని.. పిల్లల కూడా కన్నారు. కానీ, త్రిష మాత్రం ఇంకా సోలో లైఫ్ నే లీడ్ చేస్తోంది. నిజానికి గత మూడేళ్ళ నుంచే త్రిష .. మంచి సంబంధం కోసం చూస్తోందట. కానీ, సెట్ కావడం లేదు. అయితే, రీసెంట్ గానే ఓ బిజినెస్ మెన్ తో ఆమెకు ఏర్పడిన సంబంధం బలంగా బలపడిందట. కాబట్టి.. త్రిష పెళ్లి త్వరలోనే ఉంటుందేమో చూడాలి.
Also ReadL: Pushpa 2: బన్నీతో తారక్ భేటీ