ఉమేశ్ స్ధానంలో నటరాజన్‌!

60
natarajn

ఆసీస్ టూర్‌లో భాగంగా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ గాయం కారణంగా వైదొలిగాడు. ఉమేశ్ స్ధానంలో తమిళనాడు లెఫ్టార్మ్ సీమర్ టీ. నటరాజన్‌ను రిప్లేస్ చేశారు సెలక్లర్లు.ఇప్పటికే మొదటి టెస్టులో ప్రధాన పేసర్ మహ్మద్ షమీ గాయంతో సిరీస్ మొత్తానికి దూరం కాగా, రెండో టెస్టు ఉమేశ్ గాయంతో దూరం కావడంతో టీమిండియాకు కష్టంగా మారింది.

ఇటీవలే పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా జట్టులో స్థానం సంపాదించిన నటరాజన్ తన అద్బుత ఫామ్‌తో ఆకట్టుకుంటున్నారు. 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న రోహిత్ జట్టులో చేరడం భారత్‌కు మరింత బలాన్నిచ్చింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్,ఆసీస్ చెరో మ్యాచ్ గెలవగా మూడో టెస్టు ఈ నెల 7 నుండి సిడ్నీలో జరగనుంది.