దాదాపు 9 నెలల తర్వాత అంతరిక్షం నుండి బయటకు రానున్నారు సునీతా విలియమ్స్. ఈ నేపథ్యంలో నాసా, స్పేస్‌ఎక్స్ క్రూ -9 మిషన్‌లో వ్యోమగాములు నిక్ హేగ్, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, కాస్మోనాట్ అలెక్సాండర్ గోర్బునోవ్ భూమి మీదకు బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు భూమి మీదకు వస్తారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విలియమ్స్, విల్మోర్ అంతరిక్షంలో 286 రోజులు పూర్తి చేసుకున్నారని నాసా తెలిపింది. నలుగురు వ్యోమగాములు భూమి మీదకు చేరుకునేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నలుగురు వ్యోమగాములను తీసుకురావడానికి వెళ్లిన క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ గత ఆదివారం ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమైన విషయం తెలిసిందే. ఇందులో వెళ్లిన మరో నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌లో బాధ్యతలను స్వీకరించారు.
Also Read:ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ