మూవీ ఆర్టీస్ట్ అసోషియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే. నిన్న ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఈఎన్నికలు మధ్యాహ్నాం 2గంటల వరకు జరిగాయి. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాగా అర్ధరాత్రి ఫలితాలు వెలువడ్డాయి. అయితే హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికల్లో నరేష్ ప్యానల్ విజయం సాధించింది. మా లో మొత్తం 745ఓట్లు ఉండగా ఈసారి అత్యథికంగా 472మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో పాటు ఇతర మూవీ అసోసియేషన్ సభ్యులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నటుడు శివాజీరాజాకు 199ఓట్లు పోలవగా..నరేష్ కు 268ఓట్లు పోలయ్యాయి. 69ఓట్ల మెజార్టీతో నరేష్ గెలిచినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇక శివాజి రాజా, నరేష్ ప్యానల్ ల మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి ఇండిపిండెంట్ గా పోటీ చేసిన నటి హేమ గెలవడం విశేషంగా చెప్పుకోవచ్చు.
మా ప్రెసిడెంట్ గా నరేష్, జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, ట్రెజరర్‌గా రాజీవ్ కనకాల, జాయింట్ సెక్రటరీగా గౌతమ్‌రాజు, శివబాలాజీ విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా అలీ, రవిప్రకాష్, తనికెళ్ల భరణి, సాయికుమార్, ఉత్తేజ్, పృథ్వి, జాకీ, సురేశ్ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్, సమీర్, ఏడిద శ్రీరామ్, రాజా రవీంద్ర, తనీష్, జయలక్ష్మి, కరాటి కల్యాణి, వేణుమాధవ్, పసునూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.