తెలంగాణలో 16ఎంపీ స్ధానాలు టీఆర్ఎస్ కేః సీ వోటర్ సర్వే

223
TRS
- Advertisement -

తెలంగాణలో గులాబి జెండా మరోసారి విజయ దుందుభి మోగించనుంది. ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 89స్ధానాల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది టీఆర్ఎస్. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేయనుందని చెప్పింది రిపబ్లిక్ టీవి, సీ వోటర్ సర్వే. తెలంగాణలోని మొత్తం 17పార్లమెంట్ స్ధానాల్లో 16స్ధానాల్లో టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని, మిగతా ఒక స్ధానంలో ఎంఐఎం గెలుస్తుందని తెలిపింది. టిఆర్‌ఎస్‌కు మొత్తం 41.5% ఓట్ల వాటా లభిస్తుందని, ఒక్క స్థానంలో గెలిచే మజ్లస్‌కు 6.5% ఓట్ల వాటా ఉంటుందని ఆ సర్వే పేర్కొనింది.

కాంగ్రెస్‌కు 31.7% మేర ఓట్ల వాటా లభించినా ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశాలు లేవని ఇటీవల నిర్వహించిన ‘ఒపినియన్ పోల్’ సర్వేలో తేలినట్లు ఆ సంస్థలు తెలిపాయి. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంపూర్ణ మెజారీటి వచ్చే అవకాశలు లేవని తెలిపాయి. బిజెపి, కాంగ్రెస్ కూటమిలో లేని పార్టీలకు 138 సీట్లు రానున్నాయని..కూటమి కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనుందని సర్వేలు తెలిపాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్ధానాల్లో అధికార టీడీపీ 14స్ధానాలను కైవసం చేసుకగా..వైఎస్సార్ సీపీ 11 స్ధానాల్లో గెలుస్తుందని సర్వేలు పేర్కొన్నాయి.

- Advertisement -