ఓటీటీలో ‘మళ్లీ పెళ్లి’ అదుర్స్

23
- Advertisement -

నరేష్, పవిత్రా లోకేష్ కలసి నటించిన గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. కన్నడ టైటిల్ మత్తే మధువే. విలక్షణమైన కథతో పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మెగా మేకర్ ఎమ్‌ఎస్ రాజు రచన, దర్శకత్వం వహించగా, విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ నిర్మించారు.

ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటున్న ద‌ర్శకుడు ఎంఎస్ రాజు మ‌రో విభిన్న క‌థాంశంతో తెర‌కెక్కించారు.సురేష్ బొబ్బిలి, అరుల్‌దేవ్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నేపథ్యం పెద్ద ఎస్సెట్. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, జునైద్ సిద్ధిక్ ఎడిటర్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాస్కర్ ముదావత్ ప్రొడక్షన్ డిజైనర్. అయితే రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోళ్తా పడింది.

Also Read:వెల్లుల్లి రసంతో ఎన్ని ఉపయోగాలో.. !

అయితే ఓటీటీలో మాత్రం సంచలన విజమాన్ని నమోదుచేస్తోంది. జూన్ 23 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోండగా ఈ వారంలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీల్లో టాప్ 10లో నిలిచింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల్లో టాప్‌-2లో నిలవగా 100 మిలియ‌న్ ఫ్ల‌స్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతుంది. దీన్ని న‌రేశ్ రీ ట్విట్ చేస్తూ ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

Also Read:” గుంటూరు కారం ” కాపీ కథనా ?

- Advertisement -