‘మా’లో మళ్లీ మొదలైన లొల్లి..!

94
- Advertisement -

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ నిధుల దుర్వినియోగం జరుగుతుందంటూ ఇలీవల నటి హేమ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో సంచలనంగా మారాయి. ఆమె చేసిన వ్యాఖలపై తాజాగా మా అధ్యక్షుడు నరేశ్‌, జనరల్‌ సెక్రటరీ జీవితా రాజశేఖర్‌ స్పందరించారు. హేమ వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. హేమ వ్యాఖ్యలు అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఆమెపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. హేమ చేసిన వ్యాఖ్యలపై నరేశ్‌, జీవితా రాజశేఖర్‌ వివరణ ఇచ్చారు.

నరేశ్‌ మాట్లాడుతూ.. అసోసియేషన్‌ తీరు మీద హేమ చేసిన వ్యాఖ్యలు బాధాకరం. ఆమె వాయిస్‌ లీక్‌ కావడం, అందులో ‘మా’ ఫండ్స్‌ దుర్వినియోగం చేస్తున్నామనీ, ‘మా’ దివాళ తీస్తుందనే భయానక మాటలకు అంతా షాక్‌ అయ్యారు. మా దగ్గర అన్నీ ఆధారాలతో ఉన్నాయి. మెంబర్‌ షిప్‌ ద్వారా రూ. 84లక్షల ఆదాయం వచ్చింది. జీవిత 10 లక్షలు ఇచ్చారు. వివిధ రూపాల్లో వచ్చిన రూ.14 లక్షలను నేనే స్వయంగా డిపాజిట్‌ చేశా. కరోనా సమయంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి, హెల్త్‌ ఇన్సూరెన్స్‌కి కలిపి దాదాపు కోటి రూపాయిలు ఉపయోగించాం. ఫండ్స్‌ దుర్వినియోగం అవుతున్నాయనే మాట మనసుకిచాలా బాధ కలిగించింది. మాకున్న ఇమేజ్‌తో ఈ టర్మ్‌లో ఒక కోటి ఫండ్‌ తీసుకొచ్చాం. ఎక్కడా రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదు. నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం తప్పు. హేమ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని క్రమశిక్షణా సంఘానికి తెలియపరిచాం. వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటే దానిని ఆమోదిస్తాం. మేం భద్రత కోసం పని చేస్తున్నాం. మూడు టర్మ్‌లుగా జరుగుతున్న ఆర్ధిక లావాదేవీలను వివరిస్తాం. పరుచూరి గోపాలకృష్ణగారి సలహాతో మార్చిలో జరగాల్సిన ఎన్నికల్ని అందరి ఆమోదంతో సెప్టెంబర్‌కు మార్చాం. ఇప్పుడుతున్న పరిస్థితుల్లో ఎన్నికలు ఎప్పుడనేది నిర్ణయం తీసుకుంటాం’’ అని తెలిపారు. ‘మా’ ఎన్నికల ఎప్పుడనేది ఆగస్ట్‌ 22న జరిగే జనరల్‌ బాడీ మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. జనరల్‌ బాడీ మీటింగ్‌ కూడా వర్చువల్‌గానే జరగనుంది నరేశ్‌ తెలిపారు.

జీవితా రాశేఖర్‌ మాట్లాడుతూ ‘‘ఇప్పుడు హేమ చేసిన వ్యాఖ్యలే గతంలో మేము మా ఎదుటి ప్యానల్‌ మీద చేశాం. అప్పుడు ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి అలా మాట్లాడాం. మళ్లీ అందరం కలిసి పని చేసుకుంటున్నాం. ఇది ఇండియా చైనా సమస్య కాదు. ప్రజలకు ఏ మాత్రం అవసరం లేని సమస్య ఇది. దయ చేసిన మీడియాకు ముందుకెళ్లి పరువు తీయొద్దు. మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం అని ఎన్నోసార్లు చెప్పాం. అవేమీ పట్టనట్లు ‘మా’ పరువును రోడ్డున పడేస్తున్నారు. కార్పస్‌ ఫండ్‌ విషయంలో హేమ మాట్లాడింది 100 శాతం తప్పు. ఇప్పుడు అకౌంట్‌లో సుమారు రూ.4.6 కోట్లు ఉంది. అందులో 15శాతం మాత్రమే లీగల్‌గా తీసి మెడీ క్లైమ్‌, ఇన్సూరెన్స్‌ చెల్లించాం. దానిని మొత్తం రెండు కోట్లు ఖర్చు అయింది. మళ్లీ రూ.1.2 కోట్లు మళ్లీ డొనేషన్లు రూపంలో జమ చేశాం. బయటి నుంచి డబ్బు అడుక్కొని తెచ్చి ‘మా’ను నడిపాం కానీ.. మా డబ్బును ఖర్చు చేయలేదు అని హేమ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరినీ డొనేషన్‌ అడగలేం. తమ కుటుంబాలను ఎలా కాపాడుకోవాలో అని భయపడుతూ చస్తున్న రోజులివి. ఈ ఏడాది కాలంలో ‘మా’లో ఏ పనైనా చేయనిచ్చారా? 24 గంటలు గొడవలే! ఈసీ మీటింగ్‌ అనగానే అదొక మూడో ప్రపంచ యుద్ధంలా జరిగేది. ఎన్నికల సమయంలో ‘పద్దతిగా ‘మా’ వ్యవహారాలు నడపండి జీవిత, మాకొచ్చే రెమ్యూనరేషన్‌లో కొంత అసోసియేషన్‌కు ఇస్తాం’ అని పెద్ద హీరోలు చాలామంది నాకు చెప్పారు. ఇన్ని వివాదాలు జరుగుతుంటే ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని విరాళాలు అడగగలం. దయ చేసి ఆధారాలు లేని వ్యాఖ్యలు చేసి సభ్యుల్ని కన్‌ఫ్యూజ్‌ చేయొద్దు’’ అని అన్నారు.

- Advertisement -