తెలంగాణ జల వైతాళికుడు విద్యాసాగర్ రావు….

182
harishrao
- Advertisement -

తెలంగాణ జల వైతాళికుడు ఆర్ విద్యాసాగర్ రావు అని కొనియాడారు మంత్రి హరీష్ రావు. విద్యాసాగర్ రావు 3 వ వర్థంతి సందర్భంగా నివాళి అర్పించిన హరీష్..సమైక్య పాలనలో సాగు రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటిన మహనీయుడు ఆర్. విద్యాసాగర్ రావు అన్నారు.

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ ప్రాంతం కోల్పోయిన ప్రతి నీటి బొట్టును లెక్క గట్టిన జల నిపుణులు..తన చివరి శ్వాస వరకు తెలంగాణ సాగు నీటి రంగానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు.

ఆర్. విద్యాసాగర్ రావు ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోంది. ఆ ఫలితాలు ఇప్పటికే రాష్ట్రంలో కనబడుతున్నాయని.. ఆ మహనీయుడు ఆశించిన మేరకు తెలంగాణ బీడు భూముల్లో నీళ్లు పారుతున్నాయని చెప్పారు. ఆర్ .విద్యాసాగర్ రావు గారి ఆశయాల మేరకు తుదికంటా పని చేయడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అన్నారు.

- Advertisement -