సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌..

168
modi
- Advertisement -

నేడు పలు రాష్ట్రాల సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఏడు రాష్ట్రాల సీఎంలు, ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు సూచనలు చేయనున్నారు మోడీ.

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు, ఆరోగ్యశాఖ మంత్రులతో జరిగే ఈ వర్చువల్‌ సమావేశంలో కరోనా మహమ్మారి కట్టడికి ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, కేంద్రం సహకారం, ఆరోగ్య, వైద్య మౌలిక సదుపాయాల పెంపు తదితర అంశాలను సైతం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దేశంలో 63శాతం యాక్టివ్‌ కేసులు ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉండగా, మొత్తం కరోనా కేసుల్లో 65.5శాతం, మరణాల్లో 75 శాతం వరకు ఆయా రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో వారికి కీలకసూచనలు చేయనున్నారు మోడీ.

- Advertisement -