సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. రైతులను ఆదుకునేందుకు రైతు బంధు,రైతు బీమా వంటి పథకాలను తీసుకొచ్చారు కేసీఆర్. ఇదే పథకాన్ని కాపీ కొడుతూ పీఎం కిసాన్ సమ్మాన్ స్కీమ్‌ను తీసుకొచ్చారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.
తెలంగాణ అభివృద్ధి,సంక్షేమం నిరంతరాయంగా కొనసాగాలని కేసీఆర్ ఆయుత,సహస్ర చండీయాగాలను నిర్వహించారు. అయితే ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌కు యాగాలు మాత్రమే తెలుసని విమర్శించిన మోడీ తాజాగా ఆయన బాటలోనే నడిచేందుకు సిద్ధమయ్యారు.
ఈనెల 10వ తేదీనుంచి 17వ వతేదీ వరకూ ఢిల్లీలో శతరుద్ర సహిత రాజశ్యామల మహారుద్రయాగం చేయడానికి రెడీ అవుతున్నారు. యాగంలో చివరిరోజు 17వ తేదీన మోడీ పాల్గొని అష్టాదశ శక్తిపీఠాలకు చెందిన పీఠాధిపతులు ఆశీర్వచనాలు తీసుకొనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా వేలివెన్నుకి చెందిన శ్రీకాకుళపు ప్రసాద శర్మ నేతృత్వంలో ఈ యాగం జరగనుంది. 40 వేదపండితులు, 108 మంది రుత్విక్కులు ఈ యాగం నిర్వహించనున్నారు. లక్షలాదిమంది ఈ యాగానికి హాజరువుతారని భావిస్తున్నారు.
ఉత్తర భారతంలో రాజశ్యామలయాగం విరివిగా నిర్వహిస్తుంటారు. ఇక దక్షిణభారతదేశంలో కేసీఆర్ శారదా పీఠం అధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామితో ఈ యాగాన్ని నిర్వహించి వార్తల్లో నిలిచారు. అనంతరం ఎన్నికలలో అనూహ్య ఫలితాలు సాధించి రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు కేసీఆర్. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలను కాపీ కొట్టడమే కాదు కేసీఆర్ బాటలోనే యాగం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు మోడీ.