భారత్‌ మాకు అత్యంత సన్నిహిత దేశం..

237
Narendra Modi meets Donald Trump
Narendra Modi meets Donald Trump
- Advertisement -

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీకి వైట్‌హౌస్‌లో ఘనస్వాగతం పలికారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంపు. అనంతరం డొనాల్డ్‌ ట్రంప్‌తో మోడీ భేటీ అయ్యారు. ఈ సంధర్బంగా మోడీ మాట్లాడారు. వైట్‌హౌస్‌లో తనకు లభించిన గౌరవాన్ని భారతీయులకు లభించిన గౌరవంగా భావిస్తానని అన్నారు. అమెరికాతో స్నేహ సంబంధాలు మరింత బలోపేతం చేస్తామన్నారు. ఇరు దేశాలు ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆర్థిక శక్తులన్నారు. పరస్పర సహకారంపై చర్చించామన్నారు. ఉగ్రవాదం, రక్షణ, వ్యాపార తదితర అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఉగ్రవాదం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్య. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో సంయుక్త పోరాటం చేస్తాము. ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని అణచివేస్తాం. పరస్పర సహకారంతో వ్యాపార, వాణిజ్య రంగాల్ని అభివృద్ధి చేసుకుంటాము. సాంకేతిక ఆవిష్కరణలు, ఆర్థిక అవగాహన రంగాలపై దృష్టి సారిస్తాం. ఆఫ్గనిస్థాన్‌లో శాంతి స్థాపనకు భారత్‌ కట్టుబడి ఉంది.’ అని అన్నారు. ఈ సందర్భంగా మోడీ ట్రంప్‌ను భారత్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు.

modi meets trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ ‘ భారత్‌ మాకు అత్యంత సన్నిహిత దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధానికి స్వాగతం పలకడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. అత్యున్నత సంప్రదాయాలు, ఆచారాలు కలిగిన దేశం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. భారత్‌- అమెరికాలు తీవ్రవాద ప్రభావిత దేశాలు. ఇంధన వనరుల్లో ఇరు దేశాలు మరింత అభివృద్ధి సాధించాలి. సహజవాయు కొనుగోలు ఒప్పందం కొనసాగించాలి. అమెరికాలో కూడా త్వరలో కొత్త పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకొస్తాం.మోడీకి, తనకు ఒక సారూప్యత ఉంది. ఇద్దరికీ సోషల్ మీడియాపై ఆసక్తి ఉంది. సోషల్ మీడియాలో నేను, మోడీ ప్రపంచంలోనే టాప్‌గా ఉండడం ఆనందంగా ఉంది. అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రచారం చేసినప్పుడు భారత్ ఒక నిజమైన మిత్రదేశాన్ని పొందనుందని చెప్పాను. అదిప్పుడు నిజమైంది. ’ అని పేర్కొన్నారు.

modi trump

ఇస్లామిక్ తీవ్రవాదాన్ని నామరూపాల్లేకుండా చేయడంతోపాటు ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన ప్రాంతాల పనిపట్టడమే తమ ప్రధాన లక్ష్యమని భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంయుక్తంగా పేర్కొన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇదే తమ లక్ష్యమని నొక్కి వక్కాణించారు. వైట్‌హౌస్‌లో ఇద్దరు నేతల సమావేశం అనంతరం అక్కడి రోజ్ గార్డెన్‌లో ట్రంప్, మోదీ సంయుక్త ప్రకటన చేశారు. హెచ్-1బీ వీసా, పారిస్ క్లైమేట్ ఎకార్డ్ తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్టు వివరించారు.

- Advertisement -