- Advertisement -
అగ్రరాజ్యం అమెరికాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘనస్వాగతం లభించింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాలోకి వాషింగ్టన్ జాయింట్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో మోడీకి అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సందు, అమెరికా అధికారులు.. ఆర్మీ బ్రిగేడియర్ అనూప్ సింగాల్, ఎయిర్ కమాండర్ అంజన్ భద్ర, నౌకాదళ కమాండర్ నిర్భయా బప్నా విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికారు.
ఇక ప్రవాస భారతీయులు సైతం విమానాశ్రయం వద్ద త్రివర్ణ పతాకాన్ని చేపట్టుకుని ప్రధాని మోదీకి ఆహ్వానం పలికారు. తన కోసం వేచిఉన్నవారిని కలిసిన మోదీ.. వారికి కృతజ్ఞతలు తెలిపారు. వాషింగ్టన్‌లో నాకు స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు కృతజ్ఞతలు. మన ప్రవాసులే మనకు బలం అని వెల్లడించారు మోడీ.
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో 2020 జనవరి తర్వాత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించడం ఇదే మొదటిసారి.
- Advertisement -