బీజేపీ లోక్ సభ పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నకున్న ఎంపీలు

242
Modi

బీజేపీ లోక్ సభ పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్నారు బీజేపీ ఎంపీలు. దీంతో రెండోసారి ఎన్డీయే పక్ష నేతగా ఎన్నికయ్యారు మోదీ. మోదీని లోక్ సభ పక్ష నేతగా ప్రతిపాదించారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. అమిత్ షా ప్రతిపాదనను బలపర్చారు రాజ్ నాధ్ సింగ్, నితిన్ గడ్కరి. శిరోమణి అకాలీదళ్ కి చెందిన ప్రకాష్ సింగ్ బాదల్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ పేరును ప్రతిపాదించారు. జనతాదళ్ (యునైటెడ్) చీఫ్ నితీష్ కుమార్, శివసేన నేత ఉద్ధవ్ థాక్రే దీనిని బలపరిచారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… ఎన్డీఏ నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. విజయం సాధించిన ఎన్డీఏ మిత్రులకు ప్రత్యేక అభినందనలు. తొలిసారి లోక్‌సభ సభ్యులుగా గెలిచిన వారికి అభినందనలు. క్లిష్టమైన ఎన్నికల ప్రక్రియను ఈసీ విజయవంతంగా నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికలను ప్రపంచం అంతా ఆసక్తిగా గమనించింది. ఈ ఐదేళ్లలో భారత్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాం. ఈ మహత్తర విజయంతో ప్రజలు మనకు గురుతర బాధ్యత అప్పజెప్పారు. ఆధునిక భారత్ దిశగా మన ప్రయాణం ప్రారంభించామని చెప్పారు.