ఆర్. నారాయణ మూర్తి.. ఆయన సినిమాలన్నీ విప్లవాగ్నిని రగిలించేవే. అవినీతి, అన్యాయం మీద పోరాటలే ఆయన సినిమాలు. సినిమాలకు తగ్గట్టే ఆయన తెరపై గాంభీర్యంగా కనిపిస్తారు. అలాంటి నారాయణ మూర్తిని తెరపై రొమాంటిక్ చూడడం కొద్దిగా కష్టమైన పనే.సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆయన అడపా దడపా అలాంటి సీన్లలో కనిపించారు.
అయితే ఇటీవలి కాలంలో చూస్తే.. నారాయణ మూర్తి ఎక్కువ గాంభీర్యంతో కూడిన పాత్రలే పోషించారు. ఎట్టలకేలకు హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా ద్వారా ఆయన తనలోని రోమాంటిక్ యాంగిల్ ను బయటపెట్టారు. ఈసినిమాలో ఉందా.. ఉందా ఙ్ఞాపకం ఉందా అనే ఓ పాటఉంది. ఈ పాటను నారాయణమూర్తి, జయసుధలపై చిత్రీకరించారు. ఆ పాట చిత్రీకరణలోభాగంగా నారాయణ మూర్తి జయసుధ బుగ్గపై సుతిమెత్తగా కొట్టాల్సిన సీన్ ఒకటి ఉంది.
ఇలాంటి సీన్లలో పెద్దగా నటించిన అనుభంలేని ఆయన ఆ సందర్భంలోచాలా భయపడ్డాడట. ఎందుకంటే, పొరపాటున తన చేయి గట్టిగా తగిలితే జయసుధకు కష్టమవుతుందని అనుకున్నాడట. ఈ విషయంలో తాను చాలా ఫీలయ్యానని రీసెంట్ గా నారాయణ మూర్తి తెలిపారు. అయితే, అదేమి పట్టించుకోకు, హుషారుగా చేసేయ్ అని జయసుధ.. నారాయణమూర్తిని బాగా ఎంకరేజ్ చేసిందట. మొత్తానికి హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమాలో జయసుధతో రొమాన్స్ చెయ్యడానికి నారాయణ మూర్తి అలా కష్టపడ్డాడు.