విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం నారప్ప. తమిళ్‌లో ధనుష్ ‘అసురన్’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. కథలో పెద్దగా మార్పులు చేయకుండా ఉన్నదున్నట్లు ఇక్కడ రీమేక్ చేస్తున్నారు శ్రీకాంత్ అడ్డాల. ప్రియమణి ఈ చిత్రంలో హీరోయిన్. వి క్రియేషన్స్ కలైపులి ఎస్.థాను సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 14న విడుదల చేయాలని ముందుగా అనుకున్నా కరోనాతో వాయిదా పడింది. ఇప్పుడు సినిమాను డిజిటల్‌లో ఫ్లాట్‌ఫంలో విడుదల చేయబోతున్నారు.
కొన్ని రోజులుగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే నిజమైంది. జులై 20న నారప్ప ప్రైమ్‌లోనే విడుదల కానుంది. థియేటర్స్ తెరిచే ఉన్నా ఇప్పుడు సినిమాలు విడుదల చేయట్లేదు నిర్మాతలు. కొన్ని రోజులు ఆగినా కూడా అప్పుడున్న పోటీకి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే నారప్ప సినిమాను ఓటిటిలో విడుదల చేయబోతున్నారు. థియేటర్స్ ఓపెన్ ఉన్నా కూడా అటు వైపు వెళ్లే రిస్క్ చేయడం లేదు ప్రేక్షకులు. దాంతో మంచి రేట్ వస్తే నేరుగా ఆన్‌లైన్ రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే కొన్ని సినిమాలు అలా విడులదయ్యాయి.