నారా పోలీసు చేపల పులుసు..!!

271
Nara Rohit prepares Fish curry on the sets of Shamakantamani
Nara Rohit prepares Fish curry on the sets of Shamakantamani
- Advertisement -

నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్ కిష‌న్‌, ఆది హీరోలుగా న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `శ‌మంత‌క‌మ‌ణి`. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక ఈ సినిమాను కొత్తగా ప్రమోట్ చేస్తుంది చిత్ర యూనిట్‌. నలుగురు హీరోలు ఒక్కదగ్గర షూటింగ్ అంటే ఎలా ఉంటది.. ఎవరికి తెలిసిన టాలెంట్ వాళ్లు చూపిస్తారు.

అయితే ఈ నలుగురు హీరోల్లో నారా రోహిత్ స్పెషల్‌.. ఎందుకంటే మంచి వంటగాడన్న పేరుంది.. ఆయన మొన్నటికి మొన్న ‘శమంతకమణి’ సినిమా సెట్‌లో పుదీనా బిర్యానీ వండి యూనిట్‌ సభ్యులతో భేష్‌ అనిపించుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను అప్పట్లో నారా రోహిత్‌ సహనటుడు సుధీర్‌బాబు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. బిర్యానీ కమ్మగా ఉందని చెప్పారు. కాగా మరోసారి నారా రోహిత్‌ ఇదే సినిమా సెట్‌లో గరిట తిప్పారు. ఈసారి ఆయన అందరికీ చేపల కూర రుచి చూపించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ భవ్యా క్రియేషన్స్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ‘మా ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌ కుమార్‌ ‘శమంతకమణి’ సినిమా సెట్‌లో రుచికరమైన చేపల కూర వండారంటూ వీడియోని పోస్ట్ చేసింది. రోహిత్ వంట‌కాన్ని వీడియోలా రూపొందించిన టీం చివ‌రిలో ట్రైల‌ర్ ని జూన్ 30న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది..

- Advertisement -