రామ్ చరణ్, సమంతా హీరో హీరోయిన్‌లుగా సుకుమార్ దర్శకత్వంలో వై.నవీన్, వై.రవిశంకర్, సి.వి.మోహన్‌ల నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమా ఇటీవలె విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుని రికార్డులను తిరగ రాసింది. ఈ చిత్రానికి సినీ ప్రముఖుల నుంచే కాక రాజకీయ ప్రముఖుల నుంచి కూడా ప్రశసంలు అందుతున్నాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల ఈ సినిమాను చూసిన ఆయన ఈ సినిమాపై ట్విట్టర్ వేదికగా సినిమా యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. `రంగస్థలం` వంటి గొప్ప సినిమాను అందించిన రామ్‌చరణ్, సుకుమర్‌లకు హ్యాట్సాఫ్. సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆయా పాత్రలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. గ్రేట్ వర్క్ గాయ్స్` అంటూ రంగస్థలం చిత్ర యూనిట్‌ను లోకేష్ అభినందించారు. లోకేష్ చేసిన ఈ ట్వీట్‌కు రామ్‌చరణ్ ఫేస్‌బుక్ ద్వారా `ధన్యవాదాలు లోకేష్‌గారూ` అంటూ పోస్ట్ చేశాడు.
Thumbs up to Ram Charan, Sukumar & team for giving us a wonderful film like #Rangasthalam to watch. The characters stay with us after the movie was long over! Great work guys!!
— Lokesh Nara (@naralokesh) April 29, 2018