900 ఎంపీ స్థానాలకు ఎన్నికలు.. మళ్లీ ‘పప్పు’లో కాలేసిన నారా లోకేష్‌..

313
Nara Lokesh
- Advertisement -

టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్‌ మళ్లీ ‘పప్పు’లో కాలేశారు. ఎన్నికల ప్రచారంలో భాగాంగా మంగళగిరిలో రోడ్‌ షోలో ఈ విధంగా మాట్లాడారు. భారతదేశంలో 900 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు వేస్తున్నారంటూ నారా లోకేష్‌ అన్నారు. దీంతో అక్కడున్నార వారంతా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Nara Lokesh

ఈ వీడియోపై వైసీపీ కార్యకర్తలు, నెటిజన్లు లోకేష్‌ను ట్రోల్ చేస్తున్నారు. దేశంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో కూడా తెలియదా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. 545 స్థానాలుంటే ఏకంగా 900 చేశారా.. శ్రీకలం, పాకిస్థాన్‌వి కూడా కలిపావా ఏంటి అంటూ సెటైర్లు పేల్చారు.. ‘ఒరే నూ నాలుగు రోజులు మాట్లాడకుండా ఉండురా నాయనా 900ఎంపీ స్థానాలు ఎక్కడరా అయ్యా తెలుసుకొనన్నా మాట్లాడు’అంటూ నెటిజన్లు వ్యంగ్యం ట్రోల్‌ చేస్తున్నారు.

- Advertisement -