సంక్షోభాలే..అవకాశాలుగా!

2
- Advertisement -

చంద్రబాబు సీఎంగా 30 ఏళ్ల క్రితం చేపట్టిన బాధ్యతలు ఒక మైలురాయి కంటే ఎక్కువ అని కొనియాడారు ఏపీ మంత్రి నారా లోకేష్. హైటెక్ సిటీ నుంచి క్వాంటం వరకూ సీఎంగా ఆయన ప్రయాణం ఒక సజీవ వారసత్వం.. బయోటెక్ ఆకాంక్షల నుంచి డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థల వరకు పురోగతే ప్రత్యక్ష సాక్ష్యం అని ఎక్స్ వేదికగా కొనియాడారు.

సీఎంగా తొలిసారి ప్రమాణం చేసి 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న నాన్నకు శుభాకాంక్షలు.. ఇంట్లో నాన్న.. పనిలో బాస్ అని పిలుచుకునే అదృష్టం నాకు లభించింది.. పాలనకు సాంకేతికత జోడించి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన వరకూ ప్రయాణం సాగింది.. సంక్షోభాలను సైతం అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగారు అన్నారు.

చంద్రబాబు పాలనలో వేగం, బాధ్యత కలయికగా మౌలిక వసతులు, డేటా ఆధారిత సేవలు, పౌరులు–వ్యాపారులకు శక్తినిచ్చే వేదికలు రూపుదిద్దుకున్నాయి. పేదరిక నిర్మూలన పథకాలు, రిజర్వేషన్ విధానాల ద్వారా సామాజిక న్యాయం, బలహీన వర్గాల సాధికారతలో విశేష పురోగతి సాధించారు అన్నారు. ప్రత్యేకంగా నీటిపారుదల రంగంలో చారిత్రాత్మక మార్పు చోటు చేసుకుంది. హాంద్రీ–నీవా, లిఫ్ట్ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు తాగునీరు, సాగునీరు అందించారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో లక్షల ఎకరాలు పచ్చదనం చందాయి. పంటలు విస్తరించాయి, చెరువులు నిలకడగా నిలిచాయి, ఎండాకాలాల్లోనూ రైతుల ఆదాయాలు బలోపేతం అయ్యాయి. రాబోయే పోలవరం, బణకచెర్ల వంటి ప్రాజెక్టులు రాయలసీమను “రత్నలసీమ”గా మార్చనున్నాయి అన్నారు.

 

Also Read:తెలంగాణ స్థానికతపై సుప్రీం సంచలన తీర్పు

- Advertisement -