- Advertisement -
ఈ నెల 19 నుంచి 24 వరకు ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. స్పెషల్ విజిట్ ప్రోగ్రామ్ లో పాల్గొననున్నారు లోకేష్. ఆస్ట్రేలియా హైకమిషనర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు వెళ్లనున్నారు లోకేష్.
మానవ వనరులు, సాంకేతిక, ఆర్ధికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించింది అస్ట్రేలియా ప్రభుత్వం. స్పెషల్ విజిట్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని కోరింది ఆస్ట్రేలియా. ఈ నెల 24 వరకు ఆస్ట్రేలియా యూనివర్సిటీలను సందర్శించనున్నారు లోకేష్.
యూనివర్సిటీల్లో అధునాతన బోధనా పద్దతులపై లోకేష్ అధ్యయనం చేయనున్నారు. రేపు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో తెలుగు డయాస్పోరా ప్రోగ్రామ్ కు లోకేష్ హాజరుకానున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ సక్సెస్ చేయాలని కోరనున్నారు లోకేష్.
Also Read:పాక్ వైమానిక దాడి..అఫ్గాన్ క్రికెటర్లు మృతి
- Advertisement -

