Lokesh: పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ

15
- Advertisement -

ఏపీలోని మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు మంత్రి నారా లోకేశ్‌. తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ‘మన ఇల్లు – మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. సొంత ఖర్చులతో బట్టలు పెట్టి మరీ లబ్ధిదారులకు లోకేశ్ ఇంటి పట్టాలను అందించారు.

సూపర్ సిక్స్ హామీలతోపాటు మంగళగిరికి నేను ప్రత్యేకంగా ఇచ్చిన ఒక్కోహామీని నెరవేర్చే పనిలో ఉన్నానని లోకేశ్ తెలిపారు. మంగళగిరి పేదలకు ఇంటి పట్టాల పంపిణీ రెండున్నర దశాబ్దాల కల. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లో ఇంటి పట్టాలు పంపిణీకి శ్రీకారం చుట్టామని లోకేశ్ అన్నారు.

తమకు ఎవరి ద్వారా లబ్ధి చేకూరిందో ప్రజలు గుండెల మీద చేయివేసి ఆలోచించుకోవాలని, ఓడిన చోటే గెలిచి చూపాలని మంగళగిరిపై ప్రత్యేక దృష్టి సారించి 26 సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉండగా అమలు చేశానని లోకేశ్ చెప్పారు. యర్రబాలెం గ్రామానికి చెందిన 248 మందికి శాశ్వత ఇంటి పట్టాలను లోకేశ్ పంపిణీ చేశారు.

Also Read:CMRL కేసు.. చిక్కుల్లో కేరళ సీఎం కుమార్తె!

- Advertisement -