గత ప్రభుత్వ విధానంతోనే డ్రాపౌట్స్: లోకేష్

12
- Advertisement -

గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల మంది డ్రాపౌట్స్ అయ్యారని తెలిపారు మంత్రి నారా లోకేష్. జీవో నెం.117 తీసుకొచ్చి పేదలకు ప్రభుత్వ విద్యను దూరం చేశారు అన్నారు. 117 జీవోకి ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నాం అన్నారు.

టీచర్ల బదిలీలు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాం.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రేటింగ్ ఇస్తున్నాం అన్నారు. డీఎస్సీపై ప్రశ్నవేసి.. అసెంబ్లీకి గైర్హాజరయ్యారు వైసీపీ నేతలు. వైసీపీ సభ్యులు హాజరుకాకపోయిన సమాధానం ఇస్తానని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్.

మెగా డీఎస్సీ ద్వారా త్వరలో 16,347 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలోని స్కూళ్లలో ప్రహారీల నిర్మాణానికి రూ.3వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కాంపెయిన్‌ను ప్రభుత్వం చేపట్టిందని.. అన్నీ కాలేజీలు, స్కూళ్లలో ‘ఈగల్’ బృందాలు ఏర్పాలు చేస్తామని తెలిపారు. టీచర్ల బదిలీలు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాం… ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రేటింగ్ ఇస్తున్నాం అన్నారు.

Also Read:కర్తవ్యాన్ని మరిచింది ఎవరు?:సీఎంపై హరీశ్‌ ఫైర్

- Advertisement -