- Advertisement -
ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజా పాలన ప్రారంభమై నేటికి ఏడాది పూర్తయిందన్నారు ఏపీ మంత్రి లోకేష్. విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలైంది.. ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నాం అని తెలిపారు.
అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి.. గత ప్రభుత్వం ఐదేళ్లలో చేయలేని పనులు ఏడాదిలోనే పూర్తిచేశాం.. లక్ష్యం కోసం నిత్యం శ్రమిస్తాం.. ప్రజాసేవలో నిమగ్నమవుతాం.. సుపరిపాలనకు సహకరించిన ప్రజలు, ఉద్యోగులందరికీ ధన్యవాదాలు చెప్పారు.
అన్ని పనులు ఏడాదిలోనే పూర్తి చేశామని కాలర్ ఎగరేయడం లేదు. చెయ్యాల్సింది ఎంతో ఉంది. నిర్దేశించుకున్న లక్ష్యం కోసం ప్రతినిత్యం శ్రమిస్తాం. ప్రజాసేవలో నిమగ్నమవుతాం. సుపరిపాలనకు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.
Also Read:తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్డేట్
- Advertisement -

