బర్త్ డే పార్టీపై మంగ్లీ

5
- Advertisement -

బర్త్‌ డే పార్టీ వివాదంపై మంగ్లీ క్లారిటీ ఇచ్చింది. ఇది ఫ్యామిలీ ఫంక్షన్ అని, తల్లిదండ్రులు కూడా ఉన్నారని చెప్పింది. లిక్కర్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశానని, పర్మిషన్ తీసుకోవాలని అవగాహన లేదని పేర్కొంది. ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని మంగ్లీ వెల్లడించింది.

చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ బర్త్డే పార్టీ నిర్వహించిన సంసగతి తెలిసిందే. మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డారు దామోదర్. విదేశీ మద్యం అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడం పై కేసు నమోదు చేశారు.

త్రిపురా రిసార్ట్ జిఎం శివరామకృష్ణ పై కేసు నమోదు చేయగా అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డిజే సీజ్ చేశారు పోలీసులు. ఈ బర్త్డే పార్టీలో సెలబ్రిటీలు దివి, కాసర్ల శ్యామ్ పాల్గొన్నారు.

Also Read:గరుడవాహనంపై ప్రసన్న వేంకటేశ్వరుడు

- Advertisement -