పైసా వసూల్‌ సెట్ లో దేవాన్ష్ ‘సందడి

226
balakrishna.. devansh
- Advertisement -

ఇద్దరు వివిఐపి తాతయ్యలు నారా చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణ ముద్దుల మనవడు నారా దేవాన్ష్ ‘పైసా వసూలు’ సెట్ లో సందడి చేయడం, ఆ వీడియో బయటికి రావడంతో నందమూరి అభిమానులు ఆ వీడియోని షేర్ చేసి తెగ మురిసిపోతున్నారు. పైసా వసూల్.. పైసా వసూల్ అనే పాటను ఇప్పడు చిత్రీకరించలేదు. నెల రోజులో, ఇంకా పైనో అయింది. అయితే ఆ పాటు మేకింగ్ వీడియోను, స్టిల్స్ ను ఇఫ్పుడు సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బయటకు వదిలారు. సందర్భం వచ్చినప్పుడల్లా మనవడు దేవాన్ష్ గురించి బాలయ్య బోల్డన్ని కబుర్లు చెబుతుంటారు.

ఈ పాటను చిత్రీకరిస్తున్నప్పుడు నారా దేవాన్ష్ ఈ సెట్ లో సందడి చేసాడు. బాలయ్య చిందేస్తుంటే, దేవాన్ష్ ఎంజాయ్ చేసాడు, దేవాన్ష్ కూడా డ్యాన్స్ చేసాడు. ఇది చూసి బాలయ్య తెగ ముచ్చటపడిపోయాడు. బాలయ్య సతీమణి వసుంధర, కూతుళ్లు కూడా ఈ సెట్ లో సందడి చేసారు. మొత్తం మీద ‘పైసా వసూలు’ మేకింగ్ వీడియో ఫుల్ హల్ చల్ చేస్తోంది.ఎన్టీఆర్, బన్నీ లాంటి యంగ్ హీరోలు తమ పిల్లలను సెట్ తీసుకువచ్చి మురిసిపోతుంటే, బాలయ్య లాంటి సీనియర్లు మనవల్ని తీసుకువచ్చి సరదా పడుతున్నారు.

- Advertisement -