పప్పూలు వద్దు…అమ్మాయిలే ముద్దు

256
online news portal
- Advertisement -

2019 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నా…ఇప్పటికే దేశంలోని ప్రధాన జాతీయ,ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ పట్టుకునిలుపుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా వచ్చే సంవత్సరం జరగనున్న యూపీ సహా జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రధానంగా యూపీ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు తీవ్రకసరత్తు చేస్తున్నాయి. మరోవైపు అధికార ఎస్పీ అఖిలేష్..బాబాయ్‌ శివపాల్ యాదవ్‌ మధ్య పోరుతో సతమతమైతుంటే బీజేపీ, కాంగ్రెస్ వ్యుహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. బీజేపీ..ప్రధానమంత్రి నరేంద్రమోడీ చరిష్మానే నమ్ముకుంది.

online news portal

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రచారంలో ముందంజలో ఉంది. అయితే, రాహుల్‌ గాంధీ కిసాన్ సభలతో పాదయాత్రల ద్వారా ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తోన్న అంతగా ఫలితం ఉండటం లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో రాహుల్ ప్రచారం చేసిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనీసం సత్తా కూడా చాటలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ మరోమారు తెరమీదకు తెస్తున్నారు ఆ పార్టీ నేతలు. రాహుల్‌లో పార్టీని నడిపించే సామర్థ్యం లేదని…ఇందిరా వారసురాలిగా పార్టీలో కీలక బాధ్యతలతో పాటు యూపీ బాధ్యతలు ప్రియాంకకు అప్పగించాలన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరందకుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రియాంక,రాహుల్‌కు సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

online news portal

ఇక ఏపీలోనూ చంద్రబాబు 2019 ఎన్నికల కోసం ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా తన కుటుంబం నుంచి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారన్న పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో లోకేష్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నారట. ఇప్పటికే బాలయ్య కూడా ఎమ్మెల్యేగా ఉండగా తాజాగా ఆయన కూతురు, చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి పేరు తెరమీదకు వస్తోంది. బ్రహ్మాణి ఎంపీగా బరిలోకి దిగుతారని సోషల్ మీడియాలో వార్త కోడై కూస్తోంది. అయితే మరికొంత మంది మాత్రం ఆమె కూడా ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారని…సీఎం అయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం చేస్తున్నారు.

online news portal

అటు దేశ..ఇటు రాష్ట్ర రాజకీయాల్లో రాహుల్‌..లోకేష్ పెద్దగా ప్రభావం చూపడం లేదని అందుకే ప్రియాంక,నారా బ్రహ్మాణి ఎంట్రీకి రంగం సిద్ధమైందన్న వార్తలు జోరందుకున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తు…తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ప్రతిపక్ష పార్టీల నేతలు రాహుల్‌,లోకేష్‌లపై బహిరంగంగానే చలోక్తులు విసిరిన సందర్భాలున్నాయి. రాహుల్‌ని కేంద్రమంత్రి వెంకయ్య పప్పు అని ఎద్దేవా చేయగా…వైసీపీ ఎమ్మెల్యే రోజా పలుమార్లు లోకేష్‌ని పప్పుముద్దా అంటూ విమర్శించిన సందర్భాలున్నాయి. అయితే ప్రియాంక,బ్రహ్మాణి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తారో లేదో తెలియదు కాని….కాబోయే వారసురాళ్లు అంటు సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

- Advertisement -