ఏపీలోరాబోయే ఎన్నికల్లో తమ పార్టీనే విజయం సాధిస్తుందని టీడీపీ నేతలు నిన్న మొన్నటి వరకు ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపించారు. ఇప్పుడు ఎన్నికల్లో విజయం సంగతి అటుంచితే తమ పార్టీ అధినేతను ఎలా బయటకు తీసుకురావలనే దానిపై ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ లో జైలు పాలు అయిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ అంశం టీడీపీకి గట్టి దేబ్బే అని అందరూ భావిస్తున్నారు. అయితే ఇంకోరకంగా అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ సిద్దమౌతోందట. అదేమిటంటే గత ఎన్నికలకు ముందు జగన్ స్ట్రాటజీని టీడీపీ కూడా ఇప్పుడు అమలు చేయాలని భావిస్తోందట..
ఇంతకీ ఆ స్ట్రాటజీ ఏంటంటే.. గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి ఆయన చెల్లెలు వైఎస్ శర్మిల చేసిన పాదయాత్ర కూడా ఒక కారణమనే సంగతి అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్ జైల్లో ఉన్న నేపథ్యంలో పార్టీ బాద్యతలు అన్నీ భుజాన వేసుకొని వైసీపీకి అన్నీ తానై నడిపించింది షర్మిల.. ఆమె పార్టీ పరంగా యాక్టివ్ కావడం వల్లే వైసీపీ గెలిచిందనేది కొందరి వాదన. ఇప్పుడు అదే విధంగా చంద్రబాబు కూడా జైల్లో ఉన్నారు. ఆయన తనయుడు లోకేశ్ కూడా జైలుకు వెళ్ళే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మిణి మరియు నారా భువనేశ్వరి లను రాజకీయంగా యాక్టివ్ చేస్తే సెంటిమెంట్ అవుతుందని టీడీపీ భావిస్తోందట.
Also Read:ఇకపై డబ్బులకే ట్విట్టర్!
ఒకవేళ ఎన్నికల సమయానికి కూడా బాబు జైల్లోనే ఉండాల్సి వస్తే బ్రాహ్మిణి మరియు భువనేశ్వరి పార్టీ ప్రచారంలో పాలుపొందితే ప్రజల్లో సానుభూతి పెరుగుతుందనేది టీడీపీ ప్లాన్ గా తెలుస్తోంది. అసలు రాజకీయాలు ఏ మాత్రం సంబంధం లేని బ్రాహ్మిణి మరియు భువనేశ్వరి.. పార్టీ బలోపేతం కోసం ప్రచారంలో పాల్గొంటే.. చంద్రబాబాను అక్రమంగా జైల్లో వేసిన కారణంగా జగన్ పై వ్యతిరేకత పేరిటీ టీడీపీ ప్లేస్ అవుతుందనేది కొందరు చెబుతున్నా మాట. చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత నారా బ్రాహ్మిణి మరియు భువనేశ్వరి మీడియా ముందకు వచ్చి జగన్ సర్కార్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విధంగా పాలిటిక్స్ లో యాక్టివ్ అయితే టీడీపీకి కలిసొస్తుందనేది కొందరి అభిప్రాయం. మరి షర్మిల కారణంగా జగన్ కు ప్లేస్ అయిన స్ట్రాటజీ చంద్రబాబుకు వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.
Also Read:ఉపేంద్ర …’యూఐ: ది మూవీ’ టీజర్