భారీ అంచనాలతో నన్ను దోచుకుందువటే…

294
nannu dochukunduvate tommrow release
- Advertisement -

సమ్మోహనంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే. టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్ ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది.

సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండడం… హీరో, హీరోయిన్ పెర్ ఫార్మెన్స్ ఫ్రెష్ గా అనిపించింది. ఆఫీస్ మొత్తం భయ‌ప‌డే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజ‌ర్ గా సుధీర్‌బాబు న‌టించ‌గా.. అల్ల‌రి చేసే గ‌డుస‌మ్మాయి సిరి పాత్ర‌లో హీరోయిన్ న‌భా న‌టేశ్ క‌నిపించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న ప్రంపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశారు.

స‌మ్మెహ‌నం లాంటి మంచి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత సుధీర్‌బాబు నటిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నటీనటులు:సుధీర్ బాబు, నభా నటేశ్, నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్,సాంకేతిక వర్గం:డిఓపి – సురేష్ రగుతు,మ్యూజిక్ డైరెక్టర్ – అజనీష్ బి, లోకనాథ్,ఆర్ట్ డైరెక్టర్ – శ్రీకాంత్ రామిశెట్టి,ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్,పిఆర్ఓ – ఏలూరు శ్రీను,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్. సాయి వరుణ్,నిర్మాత – సుధీర్ బాబు,స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ – ఆర్ ఎస్. నాయుడు.

- Advertisement -