ప్రేమకథా చిత్రమ్,సమ్మోహనం సినిమాతో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న హీరో సుధీర్ బాబు. తాజాగా నన్ను దోచుకుందువటే అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చాడు. ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కన్నడ భామ నభా నతేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సమ్మోహనంతో లవర్ బాయ్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న సుధీర్ బాబు…నన్ను దోచుకుందువటే మరోసారి మ్యాజిక్ చేశాడా లేదా చూద్దాం.
కథ :
సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజర్ కార్తీక్(సుధీర్ బాబు). కార్తీక్ అంటే ఆఫీసులో అందరికీ భయం. పనిలో స్టిక్ట్‌గా ఉండే కార్తీక్ ప్రమోషన్ సాధించి అమెరికా వెళ్లాలని ఆశపడుతుంటాడు. తన కలను నిజం చేసుకునేందుకు కుటుంబాన్ని పట్టించుకోడు. తన డ్రీమ్‌ని నెరవేర్చుకునేందుకు తండ్రి(నాజర్)తో అబద్దం చెబుతాడు. అసలు కార్తీక్ చెప్పిన అబద్దం ఏంటీ..?దానితో ఎన్ని ఇబ్బందులు
పడతాడు..? కార్తీక్‌కు పరిచయమైన మేఘన ఎవరు..?చివరికి కార్తీక్ డ్రీమ్ నెరవేరిందా లేదా అన్నదే సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ సుధీర్ బాబు క్యారెక్టర్,కామెడీ,ఎమోషనల్ సీన్స్. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు సుధీర్ బాబు.తాజాగా ఈ సినిమాలో కూడా రొమాంటిక్ కామెడీతో అలరించాడు. ఎమోషనల్ సీన్స్‌లో చక్కని పరిణతి కనబర్చాడు. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది నబా నటేష్.తన గ్లామర్‌తో సినిమాకు మరింత ప్లస్ పాయింట్‌గా మారింది. తండ్రి పాత్రలో ఒదిగిపోయారు నాజర్. మిగితా పాత్రల్లో పృథ్వీ,తులసీ పర్వాలేదనిపించారు.
మైనస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ నెమ్మదిగా సాగే కథనం. ఫస్టాఫ్‌లో కథనంలో వేగం ఉంటే బాగుండనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్నిసన్నివేశాలు నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకులను ఇబ్బందిపెడతాయి.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. అజనీష్ అందించిన సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. నేపథ సంగీతం సూపర్బ్. సురేష్ సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. ఎడిగింగ్ పర్వాలేదు. పాటలు పర్వాలేదనిపిస్తాయి. దర్శకుడు నాయుడు కథనంపై దృష్టి సారిస్తే బాగుండేది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
సమ్మోహనం తర్వాత సుధీర్ బాబు నటించిన చిత్రం నన్ను దోచుకుందువటే. కామెడీ,సుధీర్ బాబు నటన సినిమాకు ప్లస్ కాగా నెమ్మదించిన కథనం మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో అందరికి నచ్చే క్లాసికల్ హిట్ నన్ను దోచుకుందువటే.
విడుదల తేదీ:21/09/18
రేటింగ్: 3/5
నటీనటులు : సుధీర్ బాబు, నభ నటాషా
సంగీతం : అజనీష్ లోక్‌నాథ్
నిర్మాత : సుధీర్ బాబు
దర్శకత్వం : ఆర్‌ఎస్ నాయుడు