సమ్మోహనంతో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే.. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉండడం… హీరో, హీరోయిన్ పెర్ ఫార్మెన్స్ ఫ్రెష్ గా అనిపించడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఆఫీస్ మొత్తం భయపడే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజర్ గా సుధీర్‌బాబు నటించగా.. అల్లరి చేసే గడుసమ్మాయి సిరి పాత్రలో హీరోయిన్ నభా నటేశ్ కనిపించింది.
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రెడీ అవుతున్న ఈ చిత్ర షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తయ్యింది. ప్రస్తుతం పాండిచ్చేరిలో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. అన్నికార్యక్రమాలు పూర్తిచేసి వినాయచవితి పర్వదినాన సెప్టెంబర్ 13న విడుదల చేయాటానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 12న స్పెషల్ ప్రీమియర్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ ఎనౌన్స్‌మెంట్ నుండి ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ… సుధీర్ బాబు హీరోగా సుధీర్ బాబు ప్రొడక్షన్స్‌లో నిర్మిస్తున్న నన్నుదోచుకుందువటే చిత్రానికి సంబంధించిన టీజర్‌ని జులై 14న రిలీజ్ చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్‌కి అందరూ కనెక్ట్ అయ్యారు. ఒక్క సాంగ్ మినహా ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేశాం. ప్రస్తుతం పాండిచ్చేరిలో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేసేందుకు సిద్ధమౌతున్నాం. సెప్టెంబర్ 12 నే ప్రీమియర్ షోస్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. సమ్మెహనం లాంటి మంచి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత సుధీర్‌బాబు నుంచి వస్తున్న చిత్రం కావటంతో ప్రేక్షకుల నుంచి అంచనాలు భారీగా వున్నాయి.
సుధీర్ బాబు ఫస్ట్ ప్రొడక్షన్ లో నన్ను నమ్మి, నా కథను నమ్మి అవకాశం ఇచ్చారు. సమ్మోహనం సూపర్ హిట్ అయిన తర్వాత నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన సుధీర్ బాబుకు స్పెషల్ గా థాంక్స్ తెలియజేస్తున్నాను. సినిమా అనుకున్న ప్రకారం పూర్తి చేశాం. సినిమా మీదున్న నమ్మకంతో ప్రమోషన్స్‌ను కూడా భారీగా ప్లాన్ చేశాం. అందుకు ఈ చిత్ర ప్రమోషన్‌లో తెలుగు ప్రేక్షకులందరినీ ఇన్‌వాల్వ్ చేస్తున్నాము. అలాగే ఈ చిత్రం ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకూడదనే సంకల్పంతోనే సుధీర్‌బాబు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ స్టోరీ చాలా ఫ్రెష్‌గా వుంది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభా నటేశ్ చాలా బాగా చేసింది. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. అని అన్నారు.
నటీనటులు: సుధీర్ బాబు, నభా నటేశ్, నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు.. సాంకేతిక వర్గం.. డిఓపి – సురేష్ రగుతు, మ్యూజిక్ డైరెక్టర్ – అజనీష్ బి లోకనాథ్, ఆర్ట్ డైరెక్టర్ – శ్రీకాంత్ రామిశెట్టి, ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్, పిఆర్ఓ – ఏలూరు శ్రీను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్. సాయి వరుణ్, నిర్మాత – సుధీర్ బాబు, స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ – ఆర్ ఎస్. నాయుడు.