అందులో డౌటే లేదంటున్న నాని..

206
- Advertisement -

సెలక్టెడ్ అండ్ సింపుల్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే హీరోల్లో నాని ఒకరు. వరుస హిట్లతో కెరీర్ లో పీక్ స్టేజిలో ఉన్న నాని తాను జీవితాంతం తెలుగు సినిమాలే చేస్తానని క్లారిటీ ఇచ్చేశాడు. టాలీవుడ్ – కోలీవుడ్ – మాలీవుడ్ లోని చాలామంది హీరోలు బాలీవుడ్ లో నటించే అవకాశం దొరికితే అక్కడ పాగా వేసేద్దామని ఆలోచిస్తుంటారు.

అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ – ప్రిన్స్ మహేష్ బాబు తనకు బాలీవుడ్ లో నటించే ఉద్దేశం లేదని చాలా సార్లు స్పష్టం చేశాడు. అదే తరహాలో నేచురల్ స్టార్ నాని కూడా బాలీవుడ్ పై తనకున్న ఒపీనియన్ ను ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పేశాడు.
  Nani's Heroine Bollywood Entry తనకు వచ్చిన భాష తెలుగని – తెలుగులోనే బతగ్గలనని చెప్పాడు. తెలుగులో ఓ డైలాగును తాను సొంతం చేసుకొని చెప్పగలనని ఇంక ఏ భాషలోనూ అలా చెయ్యలేనని అన్నాడు.

ఇతర ఇండస్ట్రీలో తనను పరభాషా నటుడిగానే చూస్తారని మీ దగ్గర ఆయన మంచి యాక్టరా అని వ్యంగ్యంగా మాట్లాడతారేమో అన్నాడు. తనను తెలుగు ప్రేక్షకులు ఎందుకు ఆదరిస్తున్నారో వేరే ఇండస్ట్రీ వాళ్లకు అర్థం కాదని – అందుకే ఆ రిస్క్ తీసుకోలేనని చెప్పాడు.  మొత్తానికి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనని, అందులో ఉలాంటి డౌటే లేదని చెప్పేశాడు నాని.

- Advertisement -