నాని ‘జెర్సీ’ రిలీజ్ డేట్ ఫిక్స్‌..

256
Nani
- Advertisement -

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న ‘జెర్సీ’ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. ఇటీవలే విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి అధ్బుతమైన స్పందన వచ్చింది.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ: జెర్సీ చిత్రం నాకు సినిమాగానే కాకుండా నా హృదయానికి బాగా నచ్చిన, దగ్గరైన కథ. రేపు మీ అందరి హృదయాలలో కూడా చోటు సంపాదించుకుంటుంది అనుకుంటున్నాను, ఇది 36 సంవత్సరాల వయసులో తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే అర్జున్ అనే క్రికెటర్ కథ. జెర్సీ అని ఈ సినిమాకి టైటిల్ ఎందుకు పెట్టామో ఈ చిత్రం చూసిన తరువాత అందరికీ అర్థం అవుతుంది. అర్జున్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయి ఈ చిత్రం ఇంత సక్సెస్ ఫుల్ గా రావడానికి ముఖ్య కారణమైన నానికి, అన్ని విధాలుగా సహకరించిన మా నిర్మాత నాగ వంశీకి ధన్యవాదాలు.

Nani

నిర్మాత మాట్లాడుతూ: మా ‘జెర్సీ’ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ చిత్రం మా బేనర్ లో చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుందని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాధ్, సత్యరాజ్, రోనిత్ కమ్ర,రావు రమేష్, బ్రహ్మాజీ, శిశిర్ శర్మ, సంపత్, ప్రవీణ్ ప్రధాన తారాగణం.. సంగీతం: అనిరుద్ రవిచందర్, కెమెరా: సాను జాన్ వరుఘీస్ , ఆర్ట్: అవినాష్ కొల్ల, ఎడిటర్: నవీన్ నూలి, ఎగ్జి క్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకట్ రత్నం (వెంకట్), సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగ వంశి, కధ-స్క్రీన్ ప్లే- మాటలు-దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి.

- Advertisement -