నాని 30 .. షూటింగ్ ఎప్పుడంటే?

34
- Advertisement -

నేచురల్ స్టార్ నాని అప్ కమింగ్ పాన్ ఇండియా మూవీ దసరా రిలీజ్ కి రెడీ అవుతుంది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 30న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత నాని చేయబోయే nani30 సినిమాను తాజాగా ఎనౌన్స్ చేశారు.

తాజా సమాచారం ప్రకారం మేరకు ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 1 నుండి షూటింగ్ మొదలు కానుందని తెలుస్తుంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మరియు మూర్తి KS ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ నాని సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

శౌర్యూవ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దర్శకుల విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తూ కెరీర్ కొనసాగిస్తున్న నాని శౌర్యూవ్ చెప్పిన కథకి ఫిదా అయ్యి అతన్ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఎమోషనల్ కంటెంట్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. మలయాళం ‘హృదయం’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి…

యూనివర్సల్ రీచ్ మూవీ:మైఖేల్ యూనిట్

జమునగా తమన్నా.. నిజమేనా ?

ఆర్ఆర్ఆర్…జపాన్‌లో 100రోజులు

- Advertisement -