నాని నిర్మాతగా..ప్రియదర్శి హీరో!

12
- Advertisement -

టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగాను రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలను నిర్మించిన నాని తాజాగా మరో మూవీని ప్రకటించాడు.పెళ్లిచూపులు ఫేం ప్రియదర్శి హీరోగా సినిమాను నిర్మించనున్నట్లు ప్రకటించారు నాని.

ఈ సినిమాతో జగదీష్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. వాస్తవానికి ఈ కథను నానికి వినిపించి నిర్మాతగా చేయాలని కోరారు ప్రియదర్శి. కథ నచ్చడంతో నాని సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ మొత్తం వ్యవహారానికి వేదికంగా డార్లింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్. ప్రియదర్శి హీరోగా సినిమా తీస్తున్నట్లు ఇదే వేదికగా ప్రకటించారు నాని. జగదీశ్‌ కథ చెప్పిన తర్వాత మా బ్యానర్‌ నుంచి మరో మంచి దర్శకుడుని లాంచ్‌ చేస్తున్న ఫీలింగ్‌ వచ్చిందని..త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తానని చెప్పారు.

Also Read:కలెక్టర్లతో సీఎం రేవంత్ రివ్యూ

- Advertisement -